ది ప్యారడైజ్ టీమ్ లో ఫుల్ స్పీడ్
ది ప్యారడైజ్(the paradise) రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మరింత కీలక దశకు చేరుకున్నాయి. సాధారణంగా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు ప్రమోషన్స్ పై ఫోకస్ పెడుతుంటారు. కానీ ఈ సినిమా విషయంలో ప్రస్తుతం అసలు యాక్షన్ ఎడిటింగ్, మ్యూజిక్, డబ్బింగ్, డీఐ వంటి విభాగాల్లో కనిపిస్తోంది. ఫైనల్ కట్‌ను పర్ఫెక్ట్గా తీసుకురావడంతో పాటు టెక్నికల్ గా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కంటెంట్‌ను రెడీ చేసేందుకు టీమ్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్లో మార్పులకు పెద్దగా అవకాశం లేకపోవడంతో పనులన్నింటినీ సమాంతరంగా పూర్తి చేసే ప్రయత్నం జరుగుతోందట.
ఈ వర్క్స్ లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) స్వయంగా చాలా టైమ్ కేటాయిస్తున్నారని తెలుస్తోంది. దాదాపు 40 రోజులుగా ఇంటికి వెళ్లకుండా సినిమా పనుల్లోనే నిమగ్నమై ఉన్నట్లు టాక్. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్(Anirudh)తో కలిసి వర్క్ చేయడానికి చెన్నై వెళ్లిన శ్రీకాంత్.. సినిమా మ్యూజిక్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే అనిరుధ్ తన కెరీర్లోనే బెస్ట్ వర్క్ ఇచ్చాడంటూ శ్రీకాంత్ చెప్పడంతో ది ప్యారడైజ్ మ్యూజిక్‌పై అంచనాలు మరింత పెరిగాయి. మిగిలిన విభాగాల వర్క్స్ ను కూడా డైరెక్టర్ దగ్గరుండి సమన్వయం చేస్తున్నారట.
ఇవి కూడా చదవండి
ఇక సారథి స్టూడియోస్(Sarathi studios)లో గత వారం రోజులుగా ఎడిటింగ్, డీఐ, డబ్బింగ్‌కు సంబంధించిన సూట్స్‌ను టీమ్ పూర్తిగా వినియోగిస్తున్నట్లు సమాచారం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఒక్కో పనిని వేగంగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉందట. మరోవైపు హీరో నాని(nani) సైతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలను దగ్గరుండి పరిశీలిస్తూ డైరెక్టర్ కు అవసరమైన సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది. రిలీజ్‌కు ముందు టీమ్ మొత్తం ఒకే టార్గెట్ తో పనిచేస్తున్న నేపథ్యంలో తెరపై ఈ శ్రమ ఎంతవరకు ప్రతిఫలిస్తుందో చూడాలి.








