రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న G2
అడివి శేష్(adivi sesh) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ G2పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి ఉంది. గూఢచారి(goodacharo) సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న శేష్.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న G2తో మరింత పెద్ద స్కేల్‌ను టార్గెట్ చేస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ(Emran hashmi) కీలక పాత్రలో కనిపిస్తుండగా, వామికా గబ్బి(wamiqa gabbi) కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. విదేశీ లొకేషన్లలో సాగుతున్న షూటింగ్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఫిబ్రవరి 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు క్రిస్మస్, సంక్రాంతి వంటి పెద్ద సీజన్లను టార్గెట్ చేస్తుంటాయి. అయితే G2 విషయంలో మేకర్స్ ఆ పోటీకి వెళ్లకుండాస్పెషల్ రిలీజ్ విండోను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను హడావుడిగా పూర్తి చేసి సీజన్‌ను క్యాష్ చేసుకోవడం కంటే.. సినిమాకు అవసరమైన టైమ్ తీసుకుని కంటెంట్‌ను రెడీ చేయడంపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారీ యాక్షన్, అంతర్జాతీయ స్థాయి లొకేషన్లు, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న ఈ కథను విజువల్‌గా పెద్ద స్థాయిలో చూపించాల్సి ఉండటంతో ఈ డెసిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి
డైరెక్టర్ వినయ్ కుమార్ సిరిగినీడి(Vinay kumar sirigineedi) G2ను కేవలం సీక్వెల్‌గా కాకుండా మరింత విస్తృతమైన స్పై యాక్షన్ వరల్డ్ గా తీర్చిదిద్దుతున్నట్లు షూటింగ్ స్థాయి చూస్తే అర్థమవుతోంది. ఆరు దేశాల్లో షూటింగ్ జరగడం కూడా సినిమాకు ఉన్న స్కేల్‌ను సూచిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(people media factory), అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్(abhishek agarwal arts) బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్(TG Vishwaprasad), అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) నిర్మిస్తున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 5న థియేటర్లలోకి రావడం ద్వారా సంక్రాంతి హడావుడి తర్వాత తనకంటూ ప్రత్యేకమైన స్పేస్‌ను క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.








