దసరా సీజన్ లో విజయ్ కు కీలక పరీక్ష
విజయ్ దేవరకొండ(vijay devarakonda) నుంచి రాబోతున్న రణబాలి(ranabaali)పై ఇప్పుడు ఫోకస్ అంతా దసరా సీజన్‌పైనే పడింది. టీజర్‌తో ఇప్పటికే సినిమాపై ఆసక్తిని పెంచిన మేకర్స్.. అక్టోబర్ 16న థియేటర్లలోకి తీసుకురావడానికి పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా షూటింగ్ మొత్తం పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పై టీమ్ దృష్టి పెట్టనుంది. దీంతో అనౌన్స్ చేసిన డేట్ కు సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశాలు మరింత బలపడ్డాయి. ముఖ్యంగా దసరా సెలవులు సినిమాకు కలిసొచ్చే అంశంగా మారవచ్చు.
విజయ్ దేవరకొండ కెరీర్లో రణబాలికి మరో ప్రత్యేకత కూడా ఉంది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక మందన్న(rashmika mandanna) కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో ఈ జోడీపై సహజంగానే ప్రేక్షకుల్లో అదనపు ఆసక్తి నెలకొంది. మరోవైపు ట్యాక్సీవాలా(Taxiwala), శ్యామ్ సింగరాయ్(shyam singharoy) వంటి విభిన్న నేపథ్య సినిమాలను తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యాన్(rahul sankrityan) ఈసారి పీరియాడిక్ డ్రామాతో వస్తుండటం కూడా సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్ గా కనిపించనున్నారు.
ఇవి కూడా చదవండి
ఇక సినిమాకు మ్యూజిక్ పరంగా కూడా భారీ సెటప్ కనిపిస్తోంది. బాలీవుడ్లో తమదైన ముద్ర వేసిన అజయ్(ajay)- అతుల్(Atul) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. షూటింగ్ పూర్తవడంతో ఇక నుంచి వచ్చే పోస్టర్లు, పాటలు, ట్రైలర్ వంటి ప్రచార కంటెంట్ సినిమాపై ఉన్న అంచనాలను ఏ స్థాయికి తీసుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. దసరా బాక్సాఫీస్ వాతావరణంలో విజయ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది.








