Trisha: ఆ హీరోతో కలిసి నటించాలనుంది

ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) సినిమాతో మంచి హిట్ ను అందుకున్న త్రిష సుమారు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ వస్తోంది. మధ్యలో కెరీర్ లో గ్యాప్ వచ్చినప్పటికీ పొన్నియన్ సెల్వన్(Ponniyan Selvan) మూవీ తర్వాత తిరిగి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్న త్రిష(Trisha) ప్రస్తుతం కమల్ హాసన్ తో కలిసి థగ్ లైఫ్ సినిమా చేసింది.
ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న త్రిష పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తోంది. మలయాళ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ అంటే ఇష్టమని చెప్పిన త్రిష, ఆయనతో కలిసి నటించడం తనకు చాలా ఇష్టమని చెప్పింది. మీకెవరితో నటింంచాలనుందనే ప్రశ్న తాజాగా త్రిష కు ఎదురైంది.
దానికి త్రిష రెస్పాండ్ అవుతూ ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) పేరు చెప్పింది. ఫహాద్ తో కలిసి నటిచంఆలనుంది. అతను ఎలాంటి పాత్రలో అయినా, ఎలాంటి సినిమానైనా తన భుజాలపై వేసుకుని అద్భుతంగా నటించగలడు. ఫహాద్ చాలా అద్భుతమైన యాక్టర్ అని అతనితో కలిసి నటించాలనున్న కోరికను బయటపెట్టింది. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న అలియా భట్(Alia Bhatt) కూడా ఫహాద్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే ఎలాంటి సినిమా అయినా సరే వదులుకోనని చెప్పిన సంగతి తెలిసిందే.