Trisha: రూమర్లపై త్రిష ఇన్ డైరెక్ట్ పోస్ట్
తమిళ హీరో విజయ్(Vijay), త్రిష(trisha) రిలేషన్ లో ఉన్నారనే వార్తలు గత కొన్నాళ్లుగా తెగ వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే వారిద్దరూ కలిసి జర్నీలు చేయడం, ఇద్దరూ గోవాలో జరిగిన కీర్తి సురేష్(keerthy suresh) పెళ్లికి హాజరవడం ఆ పుకార్లను నిజమనుకునేలా చేశాయి. మొన్న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి బర్త్ డే విషెస్ తెలుపుతూ త్రిష ఓ స్పెషల్ ఫోటోతో పాటూ హగ్ సింబల్ ను జోడించి విష్ చేసింది.
అది చాలదన్నట్టు ఆ పోస్ట్ ను త్రిష తల్లి షేర్ చేస్తూ దానికి లవ్ ఎమోజీలు యాడ్ చేసి ఇన్ స్టాలో స్టోరీ గా పెట్టింది. దీంతో త్రిష, విజయ్ రిలేషన్ లో ఉన్నారని అందరూ ఫిక్సైపోయి ఇష్టమొచ్చినట్టు కథనాలు రాస్తున్నారు. అయితే ఎన్ని వార్తలొచ్చినా ఈ విషయంలో అటు త్రిష కానీ, ఇటు విజయ్ కానీ ఎప్పుడూ వాటిని ఖండించింది లేదు, ఒప్పుకుంది లేదు.
ఇదిలా ఉంటే తాజాగా త్రిష ఆ రూమర్లపై ఇన్‌డైరెక్ట్ గా స్పందిస్తూ ఇన్ స్టాలో ప్రేమపై ఓ స్టోరీని పెట్టింది. ప్రేమలో మునిగిపోతే అది మిగిలిన వారిని తికమకకు గురిచేస్తుందని ఆమె పోస్ట్ చేసింది. త్రిష, విజయ్ ప్రేమలో ఉన్నారనే వార్తలు విపరీతంగా వస్తున్న నేపథ్యంలోనే త్రిష ఈ స్టోరీ ను పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా విజయ్ ప్రస్తుతం జన నాయగన్ సినిమా చేస్తుండగా, త్రిష విశ్వంభర సినిమా చేస్తోంది.
https://www.instagram.com/stories/trishakrishnan/3661856447810955390/?hl=en






