Trisha: తెలుగు సినిమాలకు త్రిష నో.. కారణమదేనా?
ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటుతున్నా త్రిష(Trisha)కు ఇప్పటికీ కోలీవుడ్ లో మంచి అవకాశాలొస్తున్నాయి. తమిళంలో స్టార్ హీరోలందరితో నటించిన త్రిష కెరీర్ మధ్యలో ఆశాజనకంగా లేకపోయినా పొన్నియన్ సెల్వన్(Ponniyan Selvan) తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. ఆ సినిమా తర్వాత త్రిషకు ఆఫర్లు క్యూ కట్టాయి. గతేడాది విజయ్(Vijay) తో లియో(Leo) సినిమాలో నటించిన త్రిష ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు, తెలుగులో ఓ సినిమా చేస్తుంది.
తెలుగులో చిరంజీవి(Chiranjeevi) సరసన విశ్వంభర(Viswambhara) చేస్తున్న త్రిష తమిళంలో విడాముయార్చి(Vidamuyarchi), గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly), థగ్ లైఫ్(Thug Life), సూర్య45(Suriya45) సినిమాలు చేస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది త్రిష నుంచి విశ్వంభరతో పటూ తమిళంలో మూడు సినిమాలు రిలీజయ్యే అవకాశాలున్నాయి. అయితే విశ్వంభరతో పాటూ త్రిషకు తెలుగు నుంచి మరో రెండు ఆఫర్లు వచ్చినప్పటికీ వాటికి అమ్మడు నో చెప్పినట్టు తెలుస్తోంది.
దానికి తమిళంలో కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉండటం ఒక కారణమైతే, తెలుగులో కేవలం కమర్షియల్ సినిమా ఆఫర్లే వస్తుండటం మరో కారణమని, అందుకే త్రిష తెలుగు సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. విశ్వంభర తర్వాత టాలీవుడ్ లో క్రేజ్ పెరిగితే అప్పుడేమైనా మనసు మార్చుకుని సినిమాలు చేస్తుందేమో చూడాలి మరి.













