Trisha: వరుస ఫ్లాపుల్లో త్రిష.. వాటిపైనే ఆశలు
96 సినిమాతో గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన త్రిష(Trisha) ఆ తర్వాత చేసిన పొన్నియన్ సెల్వన్(Ponniyan Selvan) మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ సినిమాలో తన నటన, అందంతో త్రిష అందరినీ ఆకట్టుకుంది. దీంతో త్రిషకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలేవీ త్రిష స్టార్ డమ్ ను పెంచలేకపోతున్నాయి.
గత రెండు సంవత్సరాలుగా త్రిష వరుసగా 6 ఫ్లాపులను మూట గట్టుకుంది. లియో(leo), ఐడెంటిటీ(identity), విదాముయార్చి(Vidamuyarchi), గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) సినిమాలు భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ఆ అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ సినిమాలన్నింటిలోనూ త్రిష పాత్ర కు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత దక్కలేదు. సోలోగా చేసిన థ్రిల్లర్ ది రోడ్(The Road) కూడా ఫ్లాపుగానే మిగిలింది.
ఇక రీసెంట్ గా వచ్చిన థగ్ లైఫ్(Thug Life) సినిమా గురించి మర్చిపోతే బెటర్. మిగిలిన సినిమాలతో సక్సెస్ అందకపోయినా తన పేరుకు మాత్రం ఎలాంటి మచ్చా రాలేదు. కానీ థగ్ లైఫ్ లో త్రిష చేసిన క్యారెక్టర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో త్రిష ఇప్పుడు అర్జెంటు గా ఓ హిట్ అందుకుని తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం తన ఆశలన్నింటినీ విశ్వంభర(Viswambhara), సూర్య45(Suriya45) పైనే పెట్టుకుంది. మరి ఆ సినిమాలైనా త్రిష కు ఫ్లాపుల నుంచి బ్రేక్ ను ఇస్తాయేమో చూడాలి.






