November: నవంబర్ లో రిలీజ్ కానున్న సినిమాలివే!
గత నెల సెప్టెంబర్ లో టాలీవుడ్ నుంచి పలు సినిమాలు రాగా, అందులో ప్రతీ వారం ఓ సినిమా మంచి సక్సెస్ ను అందుకుని బాక్సాఫీస్ ను కళకళలాడించింది. తేజ సజ్జ(Teja Sajja) హీరోగా వచ్చిన మిరాయ్(mirai), బెల్లంకొండ శ్రీనివాస్(bellamkonda sreenivas) కిష్కింధపురి(kishkindhapuri), మౌళి(mouli) లిటిల్ హార్ట్స్(little hearts), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ఓజి(OG) సినిమాలు మంచి కలెక్షన్లను అందుకున్నాయి. సెప్టెంబర్ లాగానే అక్టోబర్ లో కూడా పలు సినిమాలు రిలీజయ్యాయి. కానీ సెప్టెంబర్ లాగా ఏ సినిమా ఆ రేంజ్ సక్సెస్ ను అందుకోలేదు.
మరో వారంలో అక్టోబర్ పూర్తి కానుంది. అక్టోబర్ 31న రవితేజ(Ravi Teja) మాస్ జాతర(mass jathara), బాహుబలి ది ఎపిక్(Bahubali the epic) రిలీజ్ తో అక్టోబర్ అయిపోయి నవంబర్ వస్తుంది. మామూలుగా అయితే సినిమాలకు నవంబర్ నెల అనేది డ్రై సీజన్. అందుకే భారీ సినిమాలేవీ నవంబర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. అయినప్పటికీ నవంబర్ నెలలో టాలీవుడ్ నుంచి కొన్ని సినిమాలు తమ లక్ ను టెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి.
నవంబర్ 7న రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వంలో తెరకెక్కిన ది గర్ల్‌ఫ్రెండ్(the girlfriend) సినిమా రిలీజ్ కానుంది. దాంతో పాటూ సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా కలిసి నటించిన జటాధర సినిమా కూ(Sudheer babu)డా రిలీజవుతోంది. నవంబర్ 14న దుల్కర్ సల్మాన్(dulquer salman), భాగ్య శ్రీ బోర్సే(bhagyasri borse) జంటగా నటించిన కాంతా(kaantha)సినిమా రిలీజ్ కానుండగా, తరుణ్ భాస్కర్(tharun bhascker), చాందినీ చౌదరి(Chandni chowdary), బిందూ చంద్రమౌళి(Bindu Chandramouli) ప్రధాన పాత్రల్లో నటించిన సంతాన ప్రాప్తిరస్తు(Santhana prapthirastu) రాబోతుంది. ఇక నవంబర్ 28న రామ్ పోతినేని(ram pothineni), భాగ్రశ్రీ బోర్సే జంటగా వస్తోన్న ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra king taluka) ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా నవంబర్ విజేతగా నిలుస్తుందో చూడాలి.







