Dragon: ఎన్టీఆర్ నీల్ సినిమాలో అదే హైలైట్ అట
దేవర(devara) సినిమాతో సోలోగా మంచి హిట్ అందుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ఆ తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్(hrithik roshan) తో కలిసి వార్2(war2) సినిమా చేశాడు. వార్2 మూవీ ఫ్లాపైనప్పటికీ ఆ సినిమాతో ఎన్టీఆర్ కు నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్(prasanth neel) దర్శకత్వంలో డ్రాగన్(dragon) అనే యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే డ్రాగన్ పై మంచి అంచనాలుండగా, తాజాగా ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. డ్రాగన్ మూవీలో ఫాదర్ ఎమోషన్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని, ముఖ్యంగా సెకండాఫ్ ఫ్లాష్‌బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్ గా ఉంటుందని, ఆ ఎపిసోడ్ లో తారక్(Tarak) కూడా కొత్త గెటప్ లో కనిపిస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకున్న డ్రాగన్, కొత్త షెడ్యూల్ కోసం మేకర్స్ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ ను వేస్తున్నారట. ఈ సినిమాను తారక్ కెరీర్లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలపాలని నీల్ ఎంతో ట్రై చేస్తున్నాడట. అందుకే ఈ మూవీ స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ చాలా సమయం తీసుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers), ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లో రుక్మిణి వసంత్(Rukmini vasanth) హీరోయిన్ గా నటిస్తుంది.






