‘వందనం అభివందనం మీ స్పందనే బహు అద్భుతం’ తెలుగు సినీ పరిశ్రమకు కృతజ్ఞతగా ప్రభు – గంగాధరుల గీతం
తెలుగు రాష్ట్రాలలో ఏ ఉపద్రవం వచ్చిన ప్రధానంగా మేమున్నాం అంటూ ముందుకొచ్చేదే తెలుగు సినీ పరిశ్రమ….ఈసారి మునుపెన్నడూ రాని వినని కనని అంటువ్యాధి కరోనా వైరస్ ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి తెలుగు సినీ పరిశ్రమ తమ ఉదారతను చాటుకుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాలకు… ప్రధాన మంత్రి సహాయ నిధికి కోట్ల రూపాయలను విరాళంగా తమ వంతు సాయంగా విరాళాలను అందించారు. అంతే కాకుండా కరోనా మహమ్మారీ ఇతర రంగాల్లానే.. టాలీవుడ్ ని .. కుదిపేసింది రోజువారీ వేతనాన్ని పొందే సినీ కార్మికుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఉపాధి కోల్పోయిన సినీకార్మికులు నిత్యావసరాలకు సైతం ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలోనే ఇండస్ట్రీ పెద్దలు దీనిపై స్పందించి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం (సీసీసీ)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సేవా సంస్థ ద్వారా సినీకార్మికులకు తక్షణ సాయం అందించారు. కరోనా మహమ్మారీ భారిన పడకండి అంటూ…. ఇంట్లోనే వుండండి… కరోనాని తరమండి అంటూ ఇళ్లలోనే ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిరు, నాగ్‌తో పాటు వరుణ్‌తేజ్, సాయితేజ్ కలసి సంగీత దర్శకుడు కోటి సారథ్యంలో రూపొందించిన ఓ ప్రత్యేక సాంగ్ రూపొందించారు.
కరోనా వైరస్ ప్రభావాన్ని నివారించడానికి సామాజిక దూరం పాటించాలని ఆ పాటతో ద్వారా కోరారు. అలాగే పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. సేవ చేస్తున్న డాక్టర్లకు, పోలీసులకు, నర్సులకు, మరియు పారిశుద్ధ కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతూ…ప్రముఖ రచయితలు రాసిన పాటలకు ప్రముఖ గాయకులూ పాడి ఈ లాక్ డౌన్ సమయం లో అందర్నీ అలరించారు. అయితే… మేమున్నాం అంటూ తొలుత ముందు కొచ్చిన తెలుగు సినీ పరిశ్రమ కోసం కృతజ్ఞతగా… ఒక్క పాట కూడా రాలేదు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమను అభినందిస్తూ కృతఙతగా…. కీ. శే . దర్శకరత్న డా. దాసరి నారాయణ రావు రచనతో…కీ. శే స్వర చక్రవర్తి చక్రవర్తి సంగీతం సమకూర్చిన ‘ప్రేమాభిషేకం’ చిత్రం నుండి “వందనం అభివందనం……” అనే పాటకు పేరడీగా ప్రముఖ సినీ పాత్రికేయుడు ఎ . ప్రభు రాసిన పాటకు … భగవత్గీత ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ గాయకుడు, సినీ పాత్రికేయుడు ఎల్. గంగాధర శాస్ట్రీ ఈ పాటను ఆలపించారు. ఇప్పడు వీడియో లో చూడండి.













