Thaman: తమన్ ఖాతాలో మరో భారీ సినిమా?
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad), తమన్(Thaman) మధ్య చాలా టఫ్ కాంపిటీషనే ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ భారీగా ఉండటంతో టాలీవుడ్ లో ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే దానికి ఎవరు మ్యూజిక్ అందిస్తారా అనేది తెలుసుకోవడానికి అందరికీ ఆతృతగా ఉంటుంది.
ఇక అసలు విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర(Viswambhara), అనిల్ రావిపూడి(anil ravipudi) సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో విశ్వంభర సినిమాను ఇప్పటికే పూర్తి చేసిన చిరూ, త్వరలోనే అనిల్ సినిమాను కూడా పూర్తి చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి కొల్లి బాబీ(kolli bobby) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే వార్తలొస్తున్నాయి.
వీరిద్దరి కలయికలో ఇప్పటికే వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా రాగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రానుందని తెలిసి అందరూ ఎంతో సంతోషిస్తున్నారు. కాగా ఈ సినిమా మ్యూజిక్ గురించి ఓ న్యూస్ వినిపిస్తోంది. మెగా158గా రూపొందనున్న ఈ సినిమాకు తమన్(thaman) ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని బాబీ ఆలోచిస్తున్నాడట. అయితే ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.







