కూతురి డైరెక్షన్లో చిరూ మూవీ?
భోళా శంకర్ తర్వాత తన 156వ సినిమాను వశిష్ఠతో చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. విశ్వంభర టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మారేడుమిల్లి ఫారెస్ట్ లో ప్రారంభమైంది. ఇదిలా ఉంటే విశ్వంభర తర్వాత మెగాస్టార్ 157వ సినిమాను ఎవరితో చేస్తాడన్న విషయంపై ఇప్పుడు అందరికీ ఆసక్తి పెరిగిపోయింది.
మొదట్లో ఈ సినిమా కళ్యాణ్ కృష్ణ చేస్తాడని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్న చిరూ పెద్ద కూతురు సుస్మితనే ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతుందంటున్నారు. చిరంజీవి సినిమాతో సుస్మిత దర్శకురాలిగా మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మొన్నటివరకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న సుస్మిత, రీసెంట్గా నిర్మాతగా మారింది. ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ గా మారుతుందంటే మంచి విషయమే కానీ ఎలాంటి అనుభవం లేకుండా మెగాస్టార్ అంటా స్టార్ హీరోను డైరెక్ట్ చేయడమంటే మాటలు కాదు. ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సుస్మిత మెగాస్టార్ సపోర్ట్ తో హిట్ కొడితే మాత్రం తన కెరీర్ కు తిరుగుండదంటున్నారు మెగా ఫ్యాన్స్.













