“సురభి 70 ఎం ఎం హిట్టు బొమ్మ” ఫిబ్రవరి 18 న థియేటర్స్ లో రిలీజ్
అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని అలరించిన నూతన దర్శకుడు గంగాధర వై కె అద్వైత దర్శకత్వం లో రూపొందిన “సురభి 70 ఎం ఎం” సినిమా ఈ నెల 18 వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది.
“సురభి 70 ఎం ఎం హిట్టు బొమ్మ ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, సినిమా అనేది ప్రతి తెలుగువాడి నరనరాల్లో ఉన్న ఎమోషన్ , సినిమా థియేటర్ ని కాపాడుకోవాలి అనే ఒక మంచి కథతో గ్రామీణ నేపధ్యం లో పూర్తి సహజమైన పాత్రలతో తెరకెక్కించిన సురభి 70 ఎం ఎం సినిమా లో ప్రేమ కథలు , ఫామిలీ కథలు ఉన్నాయ్ అని సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం అయింది” అని చిత్ర దర్శకుడు గంగాధర్ వై కె అద్వైత అన్నారు.
ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి గారి ట్రిబ్యూట్ సాంగ్ ఐన “చిట్టి చిట్టి కన్నుల్లో” అనే పాట మెగాస్టార్ చిరంజీవి గారి వరకు చేరి సురభి 70 ఎం ఎం టీం ని అభినందించడం కూడా జరిగింది.
బాబీ ఫిలిమ్స్, జె ఎస్ ఆర్ పిక్చర్స్ సంయుక్తన్గా నిర్మించిన ఈ సినిమా ని కె కె చైతన్య ప్రొడ్యూస్ చేసారు. అక్షత శ్రీనివాస్, వినోద్, అనిల్, చందు, మహేష్, ఉషాంజలి, శ్లోక, యోగి ఖత్రి, అనీష్ రామ్, సూర్య ఆకొండి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రానికి డెన్నిస్ నార్టన్ సంగీతాన్ని అందించారు.













