సుకుమార్ తో కళ్యాణ్ రామ్ సినిమా
ఓవైపు డైరెక్టర్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు సుకుమార్. ప్రధానంగా తన శిష్యులకు ఛాన్సులిస్తూ సుకుమర్ తన బ్యానర్ లో సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సుకుమార్ మరో కొత్త ప్రాజెక్టుకు డిస్కషన్స్ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో ఈసారి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ సినిమాను సుకుమార్ నిర్మించనున్నాడట. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరకుంది.
ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సినిమా మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు కానీ మీడియా వర్గాల్లో వినిపిస్తున్న మాట ప్రకారం ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కుమారి 21ఎఫ్ సినిమాతో తన సత్తా చాటుకున్న సూర్య ప్రతాప్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. మరి ఈ సినిమాకు సుకుమార్ కేవలం నిర్మాణ భాగస్వామిగా మాత్రమే ఉంటాడో లేక తన శిష్యుడు సినిమాకు ఏవైనా రైటింగ్ లో హెల్ప్ చేస్తాడా అన్నది చూడాలి.













