Retro: రెట్రోలో శ్రియ ఐటెం సాంగ్
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ హడావిడి ఎక్కువైపోయింది. స్పెషల్ సాంగ్ అంటే దాన్నో స్పెషల్ హీరోయిన్ తో చేయించి సినిమాకు హైప్ పెంచుతున్నారు దర్శకనిర్మాతలు. స్టార్ హీరోయిన్లు సైతం ఈ స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం రెమ్యూనరేషన్, క్రేజ్.
ఈ నేపథ్యంలో సూర్య(Suriya) హీరోగా కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో రూపొందుతున్న రెట్రో(Retro) సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ స్పెషల్ సాంగ్‌ను ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రియా శరణ్(Sriya Saran) చేస్తుందని సమాచారం. ఇప్పటికే సాంగ్ షూటింగ్ కూడా అయిపోయిందని, ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఆ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు ఇన్సైడ్ టాక్.
పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న రెట్రో సినిమాకు సంతోష్ నారాయణన్(Santhosh Narayanan) సంగీతం అందిస్తున్నాడు. ఏడేళ్ల తర్వాత మళ్లీ తమిళ సినిమాలో కనిపించనుండటం తనకు ఎంతో సంతోషానిస్తుందని శ్రియ ఈ సందర్భంగా తెలిపింది.













