బ్లాస్ట్ తో పోలికలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..
విక్టరీ వెంకటేష్(venkatesh), శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) హీరోహీరోయిన్లుగా నటించిన తాజా సినిమా ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam) ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాకు సంబంధించిన పలు అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇటీవల రిలీజైన అర్జున్ సర్జా(Arjun sarja) సినిమా బ్లాస్ట్(Blast) కథకు, ఆదర్శ కుటుంబం కథకు మధ్య పోలికలు ఉన్నాయంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి తోడు త్రివిక్రమ్ స్క్రిప్ట్‌లో మార్పులు చేశారని, సినిమాలోని కొన్ని సీన్స్ ను రీషూట్ చేశారనే ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు మేకర్స్ లోని ఎవరూ ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య నిజంగానే ఏదైనా పోలిక ఉందా అనే డౌట్ ప్రేక్షకుల్లో కొనసాగింది.
తాజాగా ఈ విషయంపై హీరోయిన్ శ్రీనిధి శెట్టి స్పందిస్తూ ప్రచారానికి తెరదించారు. తాను బ్లాస్ట్ సినిమా చూశానని, ఆదర్శ కుటుంబంతో దానికి ఎలాంటి పోలిక లేదని క్లారిటీ ఇచ్చారు. ఒకే తరహా జానర్లో సినిమాలు వచ్చినప్పుడు వాటిని పోల్చి చూడటం సహజమేనని, అయితే ఈ రెండు సినిమాల కథలు భిన్నంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. తమన్(thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించింది. మరి వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ క్రైమ్ కామెడీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.








