ఆర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో క్యాంపు కార్యాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష
* ఆర్నబ్ తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం.
* తుపాను ప్రభావానికి అనుగుణంగా ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా చూడాలని సీఎం సూచనలు.
* తుపాను ప్రభావంతో కురిసే వర్షాలు, గాలులు వరద ప్రవాహాల తీవ్రతను అంచనా వేస్తూ తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసిన సీఎం.
* గతంలో వచ్చిన తుపాన్ల సమాచారాన్ని విశ్లేషిస్తూ రైతులకు, ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరించాలని సూచించిన ముఖ్యమంత్రి.
* తీరప్రాంతాల ప్రజల్ని తుపాను షెల్టర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
* సమీక్షకు హాజరైన సీఎస్ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్ సహా విపత్తు నిర్వహణ, వర్చువల్ గా హాజరైన వివిధ శాఖల ఉన్నతాధికారులు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు.








