రజనీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’ లో శ్రీలీల – అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలోకి మరో స్టార్ ను మేకర్స్ పరిచయం చేశారు. హీరోయిన్ శ్రీలీలకు స్వాగతం పలుకుతూ, ఆమెను సరికొత్త, ఆకట్టుకునే అవతార్‌లో పరిచయం చేసే గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ గ్లింప్స్‌లో శ్రీలీ ఆకట్టుకునే అవతార్‌లో కనిపిస్తూ, సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన క్లాసికల్ మ్యూజిక్ ఆమె పరిచయ సన్నివేశాలకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ““She’s the spark and she’s the pataka” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సినిమాలో శ్రీలీల పోషించబోయే పాత్ర ఎంతో సందడిగా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో ఈ సినిమా మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇందులో రజనీకాంత్ ‘ది డెడ్లీ డాక్టర్’ అనే మిస్టీరియస్ డాక్టర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తున్నారు.
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ. ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందిస్తున్నారు.
శ్రీలీలను ఆకట్టుకునే అవతార్‌లో పరిచయం చేసిన గ్లింప్స్‌తో ‘ధర్మన్’ ప్రమోషన్స్‌లో మరింత జోష్ పెరిగింది. ఆసక్తికరమైన నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక బృందం కలయికతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.







