Sree Leela: మాస్ జాతర కోసం శ్రీలీల ఎంత తీసుకుందంటే?
సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లే మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) తాజాగా మాస్ జాతర(Mass Jathara) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. పెయిడ్ ప్రీమియర్లతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి కలెక్షన్లు రాబట్టాలని మేకర్స్ పలు ప్రయత్నాలు చేస్తున్నారు.
వాస్తవానికి మాస్ జాతర ఎప్పుడో రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ తాజాగా రిలీజైంది. ధమాకా(Dhamaka) తర్వాత మరోసారి శ్రీలీల(Sree Leela), మాస్ జాతర కోసం రవితేజతో జత కట్టగా, మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే మాస్ జాతర కోసం శ్రీలీల ఎంత ఛార్జ్ చేసిందనే విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
మాస్ జాతరలో రవితేజ సరసన నటించడానికి ఈ హ్యాపెనింగ్ బ్యూటీ ఏకంగా రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. వరుస ఆఫర్లతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో దూసుకెళ్తున్న శ్రీలీల చాలా తక్కువ టైమ్ లోనే భారీ రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి వెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంలో నిజమెంతన్నది తెలియాలి.







