Sree Leela: శ్రీలీల సక్సెస్ ట్రాక్ ఎక్కేదెప్పుడు?
అందానికి అందం, గ్లామర్ కు గ్లామర్ అన్నింటికీ మించి ఇరగదీసే డ్యాన్సులు..వీటికి తోడు తెలుగులో చక్కగా మాట్లాడుతుంది శ్రీలీల(sree leela). మొదటి సినిమా పెళ్లి సందడి2(pelli sandadi2)తో మంచి హిట్ ను అందుకున్న శ్రీలీల తర్వాత రవితేజ(ravi teja)తో ధమాకా చేసి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ధమాకా(dhamaka) తర్వాత శ్రీలీల పలు సినిమాలు చేసినప్పటికీ వాటిలో ఏవీ అమ్మడికి హిట్ ను అందించలేదు.
రామ్(ram) తో చేసిన స్కంద(Skanda) ఫ్లాప్ అవగా, బాలయ్య(balayya) తో చేసిన భగవంత్ కేసరి(bhagavanth kesari) సూపర్ హిట్ గా నిలిచింది. కానీ భగవంత్ కేసరి సక్సెస్ శ్రీలీల ఖాతాలో పడలేదు. బాలయ్య, అనిల్ రావిపూడి(anil ravipudi) ఖాతాలోనే ఆ సక్సెస్ పడింది. ఆ తర్వాత ఆదికేశవ(adhikeshava), ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్(extraordinary man) సినిమాలు డిజాస్టర్లుగా నిలవగా, సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) తో చేసిన గుంటూరు కారం(gunturu karam) యావరేజ్ గా నిలిచింది.
తర్వాత రాబిన్హుడ్(robinhood) సినిమా ఫ్లాప్ అవగా, రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర(mass jathara) మూవీ కూడా డిజాస్టర్ గా మిగిలింది. మాస్ జాతరతో శ్రీలీల డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులను అందుకున్నట్టైంది. ఎంతో కాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీలీలకు ఆ సక్సెస్ ఎప్పుడు దక్కుతుందోనని ఆమె ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తండగా, శ్రీలీల నుంచి తర్వాతి సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagath singh) రానుంది. మరి పవన్(pawan Kalyan) అయినా ఆమెను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారేమో చూడాలి.







