War2: స్పెషల్ సాంగ్ కు నిర్మాతల స్కెచ్
టాలీవుడ్ లోని బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరైన ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ లోని స్టార్ యాక్టర్ కం డైరెక్టర్ అయిన హృతిక్ రోషన్(Hrtihik roshan) కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే అందరినీ ఊపిరాడనీయకుండా చేస్తే ఇక వారిద్దరూ కలిసి ఓ స్పెషల్ సాంగ్ కోసం కలిసి స్టెప్పులేస్తే అది చూడ్డానికి అభిమానులకు రెండు కళ్లు సరిపోవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
వార్2(war2) సినిమా కోసం ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించగా ఆ సినిమాలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(ayaan mukharjee) వారిద్దరిపై ఓ స్పెషల్ డ్యాన్స్ నెంబర్ ను తెరకెక్కించాడు. ఈ సాంగ్ లో హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ పోటీ పడి మరీ నటించారని బాలీవుడ్ వర్గాల నుంచి ఇప్పటికే న్యూస్ లీకవగా, ఆ స్పెషల్ డ్యాన్స్ నెంబర్ ను ఎప్పుడెప్పుడు చూడాలా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సాంగ్ ను మేకర్స్ ముందే రిలీజ్ చేయాలనుకోవడం లేదని, కేవలం గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేసి సినిమాపై హైప్ ను పెంచి ఆడియన్స్ ను కేవలం ఆ సాంగ్ కోసమైనా థియేటర్లకు రప్పించేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే యూట్యూబ్ లో ఓ చిన్న టీజర్ రూపంలో ఆ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారట. కాగా వార్2 సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.







