సోనూసూద్ మరో సాయం…

ప్రముఖ నటుడు సోనూసూద్ మరో బృహత్తర కార్యక్రమం చేపట్టారు. ఇప్పటిదాకా ఆక్సిజన్ సిలెండర్లు పంపిణీ చేసిన ఆయన ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో కోవిడ్ మృతదేహాల సంరక్షణ కోసం డెడ్‍బాడీ ఫ్రీజర్స్ పంపిణీ ప్రారంభించారు. తాజాగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు, మద్దికెర గ్రామ సర్పంచ్‍లు తోట అనుష, బండారు సుహాసినితో పాటు తెలంగాణలోని సంకిరెడ్డి పల్లి, ఆశాపూర్ బోంకూర్ గ్రామ సర్పంచ్‍లు ఇటీవల సోనూసూద్‍కు లేఖ రాశారు. తమ గ్రామాలకు డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులు, ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్లను ఇవ్వాలని కోరారు. ఒక్కోటి రెండేసి చొప్పున కావాలని వారివారి లేఖల్లో విజ్ఞప్తి చేశారు. దీనిపై సోసూసూద్ ప్రతినిధులు తమకు ఫోన్ చేశారని, త్వరలోనే సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్‍లు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, కర్నూలుకు సోనూసూద్ త్వరలోనే వస్తారని, ఆక్సిజన్ ప్లాంటును ఆయనే ప్రారంభిస్తారని తెలిసింది.