సంక్రాంతి2027 బాక్సాఫీస్‌కు స్టార్ హీరోలతో ఫెస్టివల్ హీట్!
సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ స్పెషల్ సీజన్. 2027 పండుగకు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ రిలీజ్ ప్లాన్స్ ను సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న భారీ సినిమాల్లో చాలా వరకు సంక్రాంతి టార్గెట్‌తోనే ముందుకు సాగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh), కళ్యాణ్ రామ్(Kalyan Ram) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఎంటర్టైనింగ్ మూవీ బరిలోకి వస్తుందని ప్రకటించగా, మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)- బాబీ(Bobby) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే కార్తీ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ, శర్వానంద్(Sharwanand)- శ్రీను వైట్ల(Srinu Vaitla) కాంబినేషన్లో తెరకెక్కనున్న ఎంటర్టైనర్ కూడా పండుగ సీజన్‌పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రవితేజ(RaviTeja) కొత్త సినిమా విషయంలోనూ ఇదే టార్గెట్ గా సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రావాల్సి ఉండటంతో అసలు రిలీజ్ క్యాలెండర్‌పై ఇంకా పూర్తి క్లారిటీ లేదు.
ఇక మరోవైపు బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న NBK111, ప్రభాస్(Prabhas) ఫౌజీ(Fauzi) సినిమాలు డిసెంబర్‌కే రిలీజ్ కానుండటంతో సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నాయి. నాగార్జున(Nagarjuna) ప్లాన్ చేసిన మల్టీస్టారర్ కూడా ప్రస్తుతానికి నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఐదు నుంచి ఆరు సినిమాలు సంక్రాంతి 2027 స్లాట్ కోసం పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దసరా తర్వాత షూటింగ్ పురోగతి, పోస్ట్ ప్రొడక్షన్ వేగం, అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఆధారంగా అసలు సంక్రాంతి రిలీజ్ చార్ట్‌పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.








