రిలీజ్‌కు ముందు జననాయగన్ లో భారీ మార్పులు!
విజయ్(Vijay) ఆఖరి సినిమాగా భారీ అంచనాలు సొంతం చేసుకున్న జననాయగన్(Jananayagan) రిలీజ్ కు సిద్ధమవుతున్న వేళ మేకర్స్ ప్రేక్షకులకు మరింత ప్రత్యేక అనుభూతిని అందించేందుకు కీలక మార్పులు చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా ఎదురైన వాయిదాలు, సెన్సార్ ప్రక్రియ, పైరసీ సమస్యల తర్వాత సినిమా థియేట్రికల్ వెర్షన్‌ను మళ్లీ మెరుగుపరిచినట్లు తెలుస్తోంది. ఇందులో కొన్ని కొత్త సీన్స్ తో పాటు అదనపు పాటను కూడా జోడించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆలస్యమైన రిలీజ్ టైమ్ లో ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
మరో ఇంట్రెస్టింగ్ విషయం విజయ్ ఇంట్రోకు సంబంధించినదే. ఇప్పటివరకు ఫ్యాన్స్ అలవాటు పడిన టైటిల్ కార్డ్‌కు బదులుగా, ఆయన కొత్త రాజకీయ గుర్తింపును ప్రతిబింబించే విధంగా ప్రత్యేక పరిచయం ఉండొచ్చన్న వార్తలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. అలాగే టీవీకేకు సంబంధించిన కొన్ని సూచనలు సినిమాలో కొనసాగినట్లు సమాచారం. భారతదేశంలో ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ లభించగా, యూకేలో మాత్రం ఎలాంటి కట్స్ లేకుండా పూర్తి వెర్షన్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. విదేశీ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
హెచ్. వినోద్(H Vinodh) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja hegde), బాబీ డియోల్ (Bobby deol), మమిత బైజు(Mamitha Byju), ప్రకాశ్ రాజ్(Prakash Raj), గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautham vasudev menon), నరైన్(Naren), ప్రియమణి(Priyamani) కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూలై 23న విడుదల చేయనున్నారు. రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన విజయ్‌కు నటుడిగా ఇది చివరి సినిమా కావడంతో, జననాయగన్ పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా భారీ ఆసక్తి నెలకొంది.








