రేటు పెంచేసిన భాగ్యశ్రీ
రవితేజ(Raviteja) సరసన మిస్టర్ బచ్చన్(Mr. Bachan) సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ(Bhagyasri) బోర్సేకు తొలి దశలో ఆశించిన సక్సెస్‌లు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన కింగ్డమ్(Kingdom), కాంతా(Kantha), ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra king thaluka) వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే ఈ రిజల్ట్స్ ఆమె కెరీర్‌కు పెద్దగా అడ్డంకిగా మారలేదు. ప్రతి సినిమాలోనూ తన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన భాగ్యశ్రీకి తాజాగా రిలీజైన లెనిన్(lenin) మంచి టర్నింగ్ పాయింట్‌గా మారిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
లెనిన్ సక్సెస్ తో భాగ్యశ్రీ మార్కెట్ వాల్యూ కూడా పెరిగిందని సమాచారం. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు సుమారు రూ.1.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆమె, ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల కోసం రూ.2.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమెకు వస్తున్న కొత్త ఆఫర్లన్నింటికీ ఇదే రెమ్యునరేషన్‌ను కోట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వరుస అవకాశాలు రావడంతో నిర్మాతలు కూడా ఆమె డిమాండ్‌ను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. వచ్చే ఏడాది ఆమె నటించిన రెండు లేదా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇస్తూనే ఇతర భాషల్లోనూ అడుగులు వేస్తోంది. శివకార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా తెరకెక్కుతున్న సియోన్(Seyon) సినిమాలో నటిస్తున్న భాగ్యశ్రీ, ఆ సినిమాతో కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒక హిట్‌తోనే కెరీర్ గ్రాఫ్ మారిపోయిన ఆమె, రాబోయే సినిమాలతో స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంటుందా అన్న ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది.








