హోంబళే ఫిల్మ్స్.. పాన్ ఇండియా లైనప్‌తో భారీ ప్లాన్!
కన్నడ సినీ పరిశ్రమ నుంచి మొదలైన హోంబళే ఫిల్మ్స్(Hombale Films) ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత బలమైన నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. కేజీఎఫ్(KGF), కాంతార(Kanthara), సలార్(Salaar) వంటి సక్సెస్‌లతో భారీ మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యానర్.. ఇకపై కూడా అదే దూకుడును కొనసాగించేందుకు సుదీర్ఘ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఒకవైపు సీక్వెల్స్‌ను రెడీ చేస్తూనే, మరోవైపు కొత్త కథలు, కొత్త డైరెక్టర్లు, పాన్ ఇండియా స్టార్లతో వరుస ప్రాజెక్టులను ప్లాన్ చేస్తోంది. భాషల పరిమితిని దాటుకుని జాతీయ స్థాయిలో బలమైన బ్రాండ్‌గా ఎదగాలన్న టార్గెట్‌తో హోంబళే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం అభిమానుల దృష్టి ఎక్కువగా సలార్ పార్ట్2: శౌర్యాంగ పర్వం(Salaar2: Shoryangaparvam)పై ఉంది. ప్రశాంత్ నీల్(Prasanth Neel) తన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అదే సమయంలో కేజీఎఫ్ ఛాప్టర్3(KGF Chapter3) కూడా నిర్మాణ సంస్థ మెయిన్ ప్రాజెక్టుల లిస్ట్ లో కొనసాగుతోంది. ప్రభాస్(Prabhas)తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న హోంబళే.. ఫ్యూచర్లో ఆయనతో మరిన్ని సినిమాలను రూపొందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే సూర్యతో టీజే జ్ఞానవేల్(TG Gnanavel) దర్శకత్వంలో ఓ సినిమా, హృతిక్ రోషన్(Hrithik Roshan)తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్, ప్రశాంత్ వర్మ(Prasanth Varma)తో భారీ మైథలాజికల్ మూవీ వంటి ప్రాజెక్టులు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇదిలా ఉంటే, మహావతార్(Mahavtar) సినీమాటిక్ యూనివర్స్ హోంబళే దీర్ఘకాల వ్యూహంలో కీలక భాగంగా మారింది. ఈ ఫ్రాంచైజ్‌లో వరుసగా పలు పురాణ గాథలను సినిమాలుగా తీసుకురావాలనే ప్లాన్ ను ఇప్పటికే ప్రకటించారు. 2030ల వరకు కొనసాగే ఈ యూనివర్స్‌తో భారతీయ పురాణాలను ఆధునిక టెక్నాలజీతో ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయాలన్న టార్గెట్ ను సంస్థ నిర్దేశించుకుంది. ఒకే సమయంలో స్టార్ హీరోల సినిమాలు, భారీ ఫ్రాంచైజీలు, మైథలాజికల్ యూనివర్స్‌లను సమాంతరంగా నిర్మిస్తున్న హోంబళే ఫిల్మ్స్ రాబోయే సంవత్సరాల్లో భారతీయ సినీ పరిశ్రమలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.








