Raviteja: రవితేజ ఆశలన్నీ సంక్రాంతిపైనే
జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలను చేస్తూ కెరీర్లో ముందుకెళ్లే మాస్ మహారాజా రవితేజ(ravi teja)కు గత కొన్ని సినిమాలుగా సరైన హిట్ లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ, ప్రయోగాలు చేస్తూ ఉండే రవితేజకు క్రాక్(Crack) తర్వాత మరో సాలిడ్ సక్సెస్ పడింది లేదు. క్రాక్ తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ అందులో ధమాకా(dhamaka) తప్ప మరోటి హిట్ కాలేదు.
క్రాక్ తర్వాత చేసిన ఖిలాడీ(khiladi), రామారావు ఆన్ డ్యూటీ(ramarao on duty), ఈగల్(eagle), రావణాసుర(Ravanasura), టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara rao), మిస్టర్ బచ్చన్(Mr. Bachan) అన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లుగా నిలిచినవే. దీంతో ఎలాగైనా తర్వాతి సినిమాతో హిట్ కొట్టాలని భావించిన రవితేజ, భాను భోగవరపు(Bhanu Bhogavarapu)తో కలిసి మాస్ జాతర(Mass Jathara) అనే సినిమాను చేశాడు. రీసెంట్ గా రిలీజైన మాస్ జాతర కూడా రవితేజకు మరో ఫ్లాపునిచ్చింది.
అయితే ఈ ఫ్లాపుల నుంచి బయటపడటానికి రవితేజ తన ఆశలను ఇప్పుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala)తో చేస్తున్న ఫ్యామిలీ డ్రామాపైనే పెట్టుకున్నాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha mahasayulaki vignapthi) అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను కిషోర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడని అంటున్నారు. అందుకే ఇప్పుడు రవితేజ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయంటున్నారు. 2026 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ మూవీ అయినా రవితేజ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.







