రష్మిక వాటన్నింటినీ దాటాల్సిందే!
ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో చెరగని ముద్ర వేసిన గానకోకిల ఎంఎస్ సుబ్బులక్ష్మి(MS Subbulakshmi) లైఫ్ ను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. రష్మిక మందన్నా(Rashmika Mandanna)) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్‌ను గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్(Kamal Haasan) చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ లాంచ్ కావడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. సాధారణ బయోపిక్‌లకు భిన్నంగా మ్యూజిక్, పర్సనల్ లైఫ్, కళాకారిణిగా ఆమె ప్రయాణాన్ని ఎలా చూపించబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
అయితే సినిమా ప్రారంభమైన వెంటనే సోషల్ మీడియాలో మరో డిస్కషన్ తెరపైకి వచ్చింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రకు రష్మిక ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె ఎంపికను స్వాగతిస్తుండగా, మరికొందరు విద్యాబాలన్ అయితే ఈ పాత్రకు సరిగ్గా సరిపోయేవారని అభిప్రాయపడుతున్నారు. గతంలోనే విద్యాబాలన్(Vidya Balan) ఎంఎస్ సుబ్బులక్ష్మిగా నటించాలనే తన కోరికను పలు సందర్భాల్లో వెల్లడించడంతో ఈ డిస్కషన్ మరింత ఊపందుకుంది. ఆమెను సుబ్బులక్ష్మి గెటప్‌లో చూపించే ఎడిటెడ్ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ పోలికలన్నింటినీ దాటుకుని రష్మిక తన యాక్టింగ్ తో పాత్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాల్సి ఉంటుంది. జెర్సీ(Jersey), కింగ్డమ్(Kingdom) సినిమాలతో తనదైన మేకింగ్‌ను చూపించిన గౌతమ్ తిన్ననూరి ఈసారి ఓ లెజెండరీ సంగీత కళాకారిణి కథను ఎలా మలుస్తారనేది కీలకంగా మారింది. అల్లు అరవింద్(Allu aravind), బన్నీ వాసు(Bunny Vasu), రాక్‌లైన్ వెంకటేష్(Rockline Venkatesh) నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్నారు. కాస్టింగ్‌పై జరుగుతున్న డిస్కషన్ ను మించి సినిమా రిలీజైన తర్వాత రష్మిక తన పెర్ఫార్మెన్స్ తో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.








