సారా అర్జున్ కు మరో భారీ ఆఫర్
సినీ ఇండస్ట్రీలో ఒక్క సినిమా కెరీర్‌ను పూర్తిగా మార్చేయడం చాలా రేర్ గా జరుగుతుంటుంది. ప్రస్తుతం కెరీర్లో అలాంటి మలుపులోనే ఉంది యంగ్ హీరోయిన్ సారా అర్జున్(sara arjun). ధురంధర్(durandhar), ధురంధర్: ది రివెంజ్(Durandhar: The revenge) సినిమాల తర్వాత ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్గా ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించినా.. ఈ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ఆమెకు ఊహించని స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో సారాకు ఇప్పుడు కొత్త ఆఫర్లు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సారా అర్జున్ మరో కీలక ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ మనీష్ శర్మ(Manish Sharma) రూపొందించనున్న తర్వాతి సినిమాలో ఆమె హీరోయిన్ గా కనిపించనుందని సమాచారం. ఈ సినిమాలో అంబరీష్ వర్మ(ambareesh varma) హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.
ఇక మనీష్ శర్మ పేరు బాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. బ్యాండ్ బాజా బారాత్(Band Baja barath), శుద్ధ్ దేశీ రొమాన్స్(Suddh Desi Romance) వంటి సక్సెస్ఫుల్ సినిమాలను తెరకెక్కించిన ఆయన.. కొత్త తరహా కథలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు సారా ఇటీవల తెలుగులో యుఫోరియా(Euphoria)లో కనిపించింది. అయితే ఈ సినిమాకు ఆమె ధురంధర్ సినిమా కంటే చాలా ముందే సైన్ చేసింది. గతంలో శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram) సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌లో ఆమె ప్లేస్ లోకి రషా తదానీ(Rasha Tadani) వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మనీష్ శర్మ సినిమాలో లీడ్ రోల్ దక్కడం సారా కెరీర్లో మరో కీలక అడుగుగా మారనుంది.








