చిరంజీవి భార్యగా ఆ హీరోయిన్ ?
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి(bobby kolli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న కాకా(kaaka) సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా సీనియర్ నటి స్నేహ(Sneha) ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, సినిమాలో చిరంజీవి పోషిస్తున్న పాత్రకు భార్యగా ఆమె కనిపించనుందని సమాచారం. అయితే ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
చిరంజీవితో కలిసి నటించాలనే కోరిక స్నేహకు చాలాకాలంగా ఉందనే విషయం గతంలో ఆమె పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కాకాలో ఆమెకు అవకాశం దక్కిందనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలి కాలంలో మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్న స్నేహ.. మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కెరీర్లో స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్ గా భావించే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, ఆమె పాత్ర సినిమాకు కేవలం మరో క్యారెక్టర్‌గా కాకుండా కథలో కీలకమైన ఫ్యామిలీ యాంగిల్ ను తీసుకొచ్చే అంశంగా మారొచ్చు.
ఇక కాకాలో చిరంజీవి కె. సత్యం(K. satyam) అనే ఆక్వా ఇండస్ట్రీ సూపర్వైజర్గా కనిపించనున్నారు. ఇప్పటివరకు రిలీజైన గ్లింప్స్ చూస్తే ఆయన పాత్ర వెనుక మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉన్నట్లు అర్థమవుతోంది. మలయాళ నటి అనస్వర రాజన్(anaswara rajan) అమ్ములు పాపగా కీలక పాత్రలో కనిపించనుండగా, ఆమెను చిత్ర బృందం కాకా సినిమాకు హార్ట్‌గా పరిచయం చేసింది. దీంతో చిరంజీవి, స్నేహ, అనస్వర రాజన్ పాత్రల మధ్య సంబంధం కథలో ఎలాంటి మలుపులు తీసుకురానుందనే ఆసక్తి పెరుగుతోంది.








