పాత బంగారం అమ్మే ముందు.. ఈ 4 సీక్రెట్ టిప్స్ తెలిస్తే సరైన ధర పొందొచ్చు!
మన దగ్గర వున్న పాత బంగారాన్ని అమ్మేస్తున్నామా? దీని విషయంలో చాలా జాగ్రత్తలు పడాలి. అమ్ముతున్నప్పుడు జ్వెల్లర్స్ చెప్పిన రేటుకు వెంటనే ఓకే చెప్పవద్దు. బంగారం అమ్మేటప్పుడు మోసపోకుండా, సరైన ధర పొందడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
పాత బంగారం అమ్మే ముందు ధర, క్యారెట్ చెక్ చేసుకోండి

జ్యువెలరీ షాపుకి వెళ్లే ముందే ఆ రోజు మీ నగరంలో ఉన్న ఖచ్చితమైన బంగారం ధర (22 క్యారెట్లు / 24 క్యారెట్లు) ఆన్లైన్లో చెక్ చేసుకోండి. దీని ద్వారా సరైన విధంగా మనకు గిట్టుబాటు కలుగుతుంది. చాలా మంది జ్యువెలర్స్ బోర్డుపై డిస్ప్లే చేసే రేటు కంటే తక్కువ ధరకు పాత బంగారాన్ని లెక్కించడానికి ప్రయత్నిస్తారు. దీని వల్ల ఇబ్బందులు వస్తాయి.
ఇవి కూడా చదవండి
అలాగే క్యారెట్ టెస్టింగ్ కూడా చేసుకోవాలి. మీ బంగారం ఎన్ని కేరెట్లో మనకు ముందే తెలిసి వుండాలి. దీని ద్వారా ఎంతకు అమ్మవచ్చునో ఓ ఐడియా వస్తుంది. షాపులో వాళ్లు కరిగించి చూస్తామని చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండండి. వీలైతే అధునాతన క్యారెట్ మీటర్ (Carat gold testing machine) ఉన్న షాపుల్లోనే చెక్ చేయించండి. దీనివల్ల బంగారం వేస్ట్ కాకుండా ఖచ్చితమైన నాణ్యత తెలుస్తుంది. నాణ్యత బట్టి రేటు కూడా లభిస్తుంది.
తరుగు, హాల్‌మార్క్ విషయంలో జాగ్రత్త.. షాపుల రేట్లు పోల్చండి

అలాగే తరుగు, కలుపుతీత విషయంలో కూడా జాగ్రత్తగా వుండాలి. జ్యువెలర్స్ పాత బంగారాన్ని కొనేటప్పుడు తరుగు (Wastage) పేరుతో 5% నుండి 20% వరకు ధర తగ్గిస్తుంటారు దుకాణపు యజమానులు. నగలు చేసేటప్పుడు రాళ్లు (stones), ఎనామెల్, మురికి వంటివి ఉంటే వాటి బరువును పూర్తిగా మినహాయించాలి. కానీ, కేవలం బంగారం బరువులోనే ఎక్కువ తరుగు తీసేస్తున్నారేమో లెక్క అడగండి.యాసిడ్ టెస్ట్ లేదా కాల్చే పద్ధతి కంటే XRF మషీన్ ద్వారా స్వచ్ఛతను కొలిచే దుకాణాలకే ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల బంగారం బరువు తగ్గదు, స్వచ్ఛత శాతం కచ్చితంగా తెలుస్తుంది.
మరో వైపు హాల్ మార్క్ వుంటే తిరుగే వుండదు. మీ పాత బంగారంపై BIS హాల్‌మార్క్ ముద్ర ఉంటే, దాని నాణ్యతను జ్యువెలర్ తక్కువ చేయడానికి వీల్లేదు.హాల్‌మార్క్ నగలకు మార్కెట్ ధర ప్రకారం పూర్తి విలువ రావాలి. బిల్లు ఉంటే ఇంకా మంచిది. అయితే.. పాత బంగారాన్ని తీసేసే క్రమంలో కేవలం ఒక్క షాపులోనే అడగొద్దు.. మూడు, నాలుగు షాపుల్లో రేట్లు అడగాలి. కనీసం 2-3 పెద్ద జ్యువెలరీ షోరూమ్‌లలో మీ పాత బంగారానికి ఎంత ఇస్తున్నారో కనుక్కోండి. ఎక్కడ తక్కువ తరుగు తీసి, ఎక్కువ రేటు ఇస్తారో అక్కడే అమ్మండి.








