ఆసక్తి పెంచుతున్న రాకా అప్డేట్
టాలీవుడ్లో భారీ అంచనాలతో రూపొందుతున్న సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun), డైరెక్టర్ అట్లీ(atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాకా(Raaka) ఒకటి. సినిమా కథ, లుక్, యాక్షన్ స్కేల్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొనగా.. ఇప్పుడు మేకర్స్ ఇచ్చిన చిన్న హింట్ కొత్త డిస్కషన్ కు తెరలేపింది. సన్ పిక్చర్స్(Sun Pictures) సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన సర్ప్రైజ్ పోస్టర్లో కనిపించిన 37 నెంబర్ ప్రస్తుతం ఫ్యాన్స్ ఫోకస్‌ను మొత్తం తనవైపు తిప్పుకుంది. ఇది ఏ విషయానికి సంకేతమనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అట్లీ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఏదైనా స్పెషల్ గ్లింప్స్ వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. అయితే అంతకంటే ముందే సెప్టెంబర్ 20 సాయంత్రం మేకింగ్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. భారీ విజువల్ ఎఫెక్ట్స్, విభిన్న టెక్నికల్ వర్క్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ వెనుక పనిచేస్తున్న కీలక టెక్నీషియన్లను ఈ వీడియో ద్వారా పరిచయం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు పోస్టర్లు, అప్డేట్లకే పరిమితమైన సినిమా మేకింగ్‌పై మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
మరోవైపు రాకాను కేవలం స్టార్ కాంబినేషన్‌గా కాకుండా భారీ విజువల్ స్పెక్టకిల్‌గా తీర్చిదిద్దుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె(Deepika Padukone), రష్మిక మందన్నా(Rashmika Mandanna), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), జాన్వీ కపూర్(Janhvi kapoor), ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. 2028లో రిలీజ్ టార్గెట్ గా సాగుతున్న ఈ సినిమాకు సంబంధించి సెప్టెంబర్ 20, 21 డేట్స్ ఫ్యాన్స్ కు వరుస సర్ప్రైజ్లు ఇచ్చే రోజులు కానున్నాయా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








