ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రష్మిక.. కమల్ క్లాప్ తో మరింత స్పెషల్ గా మారిన ప్రాజెక్టు
సినీ ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్నా(rashmika mandanna) ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి(MS Subbalakshmi) జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ఆమె టైటిల్ రోల్ పోషించనున్నారు. చెన్నైలో జరిగిన గ్రాండ్ లాంచ్‌తో ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా మొదలైంది. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్(kamal haasan) హాజరై క్లాప్ కొట్టడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీంతో ఈ బయోపిక్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham thinnanuri) తెరకెక్కించనున్నారు. దాదాపు ఏడాది కాలంగా సాగుతున్న ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పాత్ర రూపకల్పన, కాలానుగుణ వాతావరణం, మ్యూజిక్ కు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అనిరుధ్ సహా పలువురు ప్రముఖ టెక్నీషియన్స్ ఈ సినిమాలో భాగం కావడం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితంలోని కీలక ఘట్టాలను కేవలం బయోపిక్‌గా కాకుండా, ఆమె మ్యూజికల్ జర్నీ చుట్టూ ఎమోషనల్ స్క్రీన్‌ప్లే తో చూపించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం.
ఇక లాంచ్ కార్యక్రమంలో చీరకట్టులో కనిపించిన రష్మిక, ఈ పాత్ర తనకు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు గ్లామర్, కమర్షియల్ క్యారెక్టర్లతో ఆడియన్స్ కు దగ్గరైన ఆమె.. ఇలాంటి చారిత్రక వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించడం నటిగా మరో కొత్త దశగా మారనుంది. అల్లు అరవింద్(Allu aravind), బన్నీ వాసు(bunny vasu), రాక్‌లైన్ వెంకటేష్(Rockline venkatesh) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో పనులు సాగుతున్నాయి.








