ట్రైలర్ తో అసలు కథ చెప్పనున్న రణబాలి
విజయ్ దేవరకొండ(vijay devarakonda), రష్మిక మందన్నా(Rashmika mandanna) జంటగా రాహుల్ సాంకృత్యాన్(Rahul Sankrithyan) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి(Ranabaali)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 8న సాయంత్రం 6:03 గంటలకు థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఏకంగా 3.47 నిమిషాల రన్ టైమ్ తో ట్రైలర్‌ను రెడీ చేయడంతో సినిమాలోని కీలక అంశాలను విస్తృతంగా చూపించే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటివరకు సాంగ్స్, డాక్యుమెంటరీ సిరీస్, విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో రణబాలిపై ఆసక్తిని పెంచుతూ వచ్చిన టీమ్.. ట్రైలర్‌తో సినిమాకు సంబంధించిన అసలు ప్రపంచాన్ని ఆడియన్స్ కు పరిచయం చేయనుంది. ముఖ్యంగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, భారీ విజువల్స్, ప్రధాన పాత్రల స్వభావం, కథలోని సంఘర్షణ వంటి అంశాలపై ట్రైలర్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో కథలోని కీలక మలుపులను పూర్తిగా బయటపెట్టకుండా సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌ను దాచిపెట్టేలా కట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్‌తో పాటు అంతర్జాతీయ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఉండటం సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అజయ్(Ajay)- అతుల్(Atul) మ్యూజిక్, రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన పీరియాడిక్ వరల్డ్, భారీ టెక్నికల్ వాల్యూస్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ కు సరిగ్గా వారం రోజుల ముందు రానున్న ట్రైలర్.. రణబాలి ఏ స్థాయి సినిమా అనే దానిపై కీలకమైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.








