తిక్క ఉన్న పోలీస్ గా ఇస్మార్ట్ హీరో..
పోలీస్ క్యారెక్టర్ ని కూడా డిఫరెంట్ గా డిజైన్ చేయడం గబ్బర్ సింగ్ తర్వాతే కుదిరింది. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ తిక్క కు లెక్క ఉంటే, పటాస్ లో కళ్యాణ్ రామ్ కు వేరే తిక్క, టెంపర్ లో ఎన్టీఆర్ క్వాలిటీస్ వేరు. రీసెంట్ గా వచ్చిన క్రాక్ లో రవితేజ క్రాక్ పోలీస్ గా కనిపించాడు. ఇప్పుడు అలాగే మరో క్యారెక్టర్ టాలీవుడ్ లో నిలవనుంది.
అది మరెవరో కాదు. ఎనర్జిటిక్ హీరో రామ్ తన తర్వాతి సినిమాలో డిఫరెంట్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడట. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఎలివేషన్ ను పెంచుకున్న రామ్ కు ఇలాంటి పోలీస్ స్టోరీ దొరికితే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. మరోసారి రామ్ నుంచి పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట.
రాపో19 గా తమిళ డైరక్టర్ లింగుస్వామి డైరక్షన్ లో తన తర్వాతి సినిమాను చేయనున్న రామ్, ఈ సినిమాలో ఒక కాప్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడట. రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి మెసేజ్ తో అందరినీ ఆకట్టుకోనుందట. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ రెడ్ సినిమాతో ఆ విజయాన్ని కంటిన్యూ చేయాలని చూసినా అది జరగలేదు. దీంతో ఇప్పుడు లింగుస్వామి లాంటి సీనియర్ తో పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒక వేళ రామ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తుంది నిజమే ఐతే అది ఫ్యాన్స్ కు చాలా మంచి వార్తే. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ తో సినిమాలు చేయడానికి మంచి మంచి పేరున్న డైరక్టర్లే లైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.













