Kamal Hassan: రజినీ కోసం కమల్ భారీ ప్లాన్
లోకనాయకుడు కమల్ హాసన్(kamal hassan) నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. కమల్ నిర్మాతగా ఇప్పటికే ఎన్నో సినిమాలు రాగా అందులో కొన్ని సినిమాలు హిట్లుగా నిలిస్తే మరికొన్ని సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. కాగా కమల్ విక్రమ్(vikram) మూవీతో నిర్మాతగా నెక్ట్స్ లెవెల్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.
లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వంలో కమల్ హీరోగా నటిస్తూ నిర్మించిన విక్రమ్ మూవీ హీరోగా కమల్ కు మంచి కంబ్యాక్ ను ఇవ్వడమే కాకుండా నిర్మాతగా మంచి లాభాలను కూడా అందించింది. విక్రమ్ తర్వాత శివ కార్తికేయన్(siva karthikeyan) హీరోగా అమరన్(amaran) మూవీని నిర్మించగా, అది భారీ హిట్ గా నిలిచింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(rajkamal flms international) బ్యానర్ లో అప్పటివరకు అత్యధిక ఖర్చుతో తెరకెక్కిన సినిమా అదే.
అయితే ఇప్పుడు కమల్ హాసన్ తన బ్యానర్ లో మరో భారీ బడ్జెట్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. రజినీకాంత్(rajinikanth) హీరోగా సుందర్ సి(sundar C) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను కమల్ తన బ్యానర్ లోనే కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ గా తీయాలని భావిస్తున్నారని, తన ఫ్రెండ్ రజినీతో చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీని స్పెషల్ గా నిలపాలని కమల్ డిసైడయ్యారని తెలుస్తోంది. వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్టును 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారని సమాచారం.







