OTT Deals: భారీ సినిమాల ముందు ఓటీటీ పరీక్ష

ఓటీటీ డిమాండ్ బాగా పెరిగిన నేపథ్యంలో అందరూ తమ సినిమాలను ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఓటీటీని దృష్టిలో పెట్టుకుని టీజర్లు, ట్రైలర్లు కట్ చేసి ఆయా సంస్థలను ఎట్రాక్ట్ చేస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగానే కొన్ని సినిమాలు చాలా ముందుగానే ఓటీటీ డీల్ ను పూర్తి చేసుకుంటున్నాయి.
కానీ మరికొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ డీల్ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తూ ఉండటం వల్ల వాటికి ఆ డీల్స్ పూర్తవడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. టాలీవుడ్ లోని రెండు పెద్ద సినిమాలకు ఇప్పుడదే పరిస్థితి ఏర్పడింది. ఆ సినిమాలు మరేవో కాదు. ది రాజా సాబ్(the raja saab) మరియు విశ్వంభర(Viswambhara). ఈ రెండు సినిమాలూ టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమాలే.
ప్రభాస్(prabhas) హీరోగా మారుతి(maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన రాజా సాబ్ ట్రైలర్(Raja Saab Trailer) ఇంత ముందుగా రిలీజ్ చేయడానికి ఓటీటీ డీల్ ఫినిష్ చేయాలనేది కూడా ఓ కారణమని తెలుస్తోంది. ఇక విశ్వంభర విషయానికొస్తే సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ ఫినిష్ అవగానే ఆ సినిమా ఓటీటీ డీల్ ను కూడా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ రెండు సినిమాలూ ఓటీటీ రైట్స్ విషయంలో ఎలాంటి రికార్డులను సృష్టిస్తాయో చూడాలి.