NTR: వాళ్లలానే ఎన్టీఆర్ కూడా మోసపోయాడుగా!

ఎప్పుడెప్పుడా అని ఎంతో ఎదురుచూసిన ఎన్టీఆర్(NTR) బాలీవుడ్ డెబ్యూ వార్2(War2) సినిమాతో గురువారం గ్రాండ్ గా జరిగింది. అయాన్ ముఖర్జీ(ayaan mukharjee) దర్శకత్వంలో హృతిక్ రోషన్(Hrithik roshan) తో కలిసి ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. అయితే వార్2 పై ఎన్టీఆర్, అతని ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాల్ని మాత్రం ఆ సినిమా అందుకోలేకపోయింది.
హృతిక్, అయాన్ ను నమ్ముకుని ఎన్టీఆర్ రాంగ్ స్టెప్ వేశాడని నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) చేసిన తప్పుల్నే ఇప్పుడు తారక్(tarak) కూడా చేశాడని అంటున్నారు. రామ్ చరణ్ కూడా గతంలో అపూర్వ లఖియా(apoorva lakhiya) దర్శకత్వంలో జంజీర్(zanjeer) సినిమా చేసి డిజాస్టర్ ను అందుకున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్(adhipurush) చేస్తే ఆ సినిమా కూడా భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఈ పరిస్థితులన్నింటినీ చూసి టాలీవుడ్ హీరోలను తమ అభిమానులు బాలీవుడ్ డైరెక్టర్లను చూసి మోసపోకండని సలహాలిస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్(allu arjun), మహేష్ బాబు(mahesh babu) మాత్రం ఎగ్జైట్ అవకుండా బాలీవుడ్ ప్రాజెక్టుల నుంచి దూరంగా ఉండటాన్ని ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు.