Viswambhara: విశ్వంభర మేకర్స్ ఇప్పుడైనా రెస్పాండ్ అవుతారా?

భోళా శంకర్(Bhola Shankar) బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాక చిరంజీవి(chiranjeevi) తన తర్వాతి సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అందుకే కాస్త టైమ్ తీసుకుని మరీ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట(Vasishta) దర్శకత్వంలో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. అనౌన్స్‌మెంట్ తోనే ఈ సినిమాపై భారీ బజ్ నెలకొంది. దానికి తోడు విశ్వంభర సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో వస్తుందని తెలిసి ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు.
మొదట్లో ఈ సినిమా నుంచి విపరీతంగా అప్డేట్స్ వచ్చేవి. కానీ ఎప్పుడైతే టీజర్ వచ్చిందో అప్పట్నుంచి ఈ సినిమా గురించి పెద్దగా బజ్ లేదు. విశ్వంభర(Viswambhara) టీజర్ లోని వీఎఫ్ఎక్స్ బాలేవని టాక్ రావడంతో ఆ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని మార్చేసిన టీమ్, ఆ తర్వాత నుంచి పెద్దగా అప్డేట్స్ ఇచ్చింది లేదు. వాస్తవానికైతే విశ్వంభర మొన్న సంక్రాంతికే రావాల్సింది.
కానీ రామ్ చరణ్(ram charan) గేమ్ ఛేంజర్(game changer) కోసం విశ్వంభరను వాయిదా వేసుకున్నాడు చిరంజీవి. ఆ తర్వాత మే 9న రిలీజన్నారు. అదీ లేదు. దీంతో అసలు విశ్వంభర ఎప్పుడు రిలీజవుతుందని ఫ్యాన్స్ అడుగుతున్నారు. కనీసం రిలీజ్ డేట్ విషయంలో ఒక చిన్న అప్డేట్ అయినా ఇవ్వాలని మేకర్స్ ను సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి ఇప్పటికైనా విశ్వంభర టీమ్ ఈ విషయంలో స్పందించి కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తుందేమో చూడాలి.