పుష్ప2లో సాయి పల్లవి.. ఛాన్సే లేదు!
గత రెండు రోజుల నుంచి ఏ వెబ్ సైట్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా ఒకే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అల్లు అర్జున్‌తో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జోడీ కట్టనుందని, బన్నీ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప2 లోనే ఆమె నటించనుందనేది ఆ వార్త. పుష్ప1 లో బన్నీకి జోడీగా రష్మిక నటించగా, రెండో పార్ట్‌లోనే ఆమెనే హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే పుష్ప2లో సాయి పల్లవి కోసం ఓ స్పెషల్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేశారని, ఆ క్యారెక్టర్‌ను ఆమెకు ఆఫర్ చేయగానే పల్లవి ఓకే చెప్పేసిందని త్వరలో షూటింగ్‌కు కూడా హాజరు కాబోతుందని ఎవరికి నచ్చినట్లు వాళ్లు వార్తలు రాస్తున్నారు. ఈ కాంబినేషన్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఫ్యాన్స్ కూడా ఎగ్జయిట్ అవుతున్నారు.
కానీ ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని పుష్ప-2 టీమ్ మెంబర్స్ చెప్తున్నారు. సినిమాలో మరో హీరోయిన్ క్యారెక్టర్‌కు ఏ మాత్రం ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. వాస్తవానికి కొంచెం ఆలోచిస్తే ఈ సినిమాలో నటించే ఛాన్సే లేదని తెలిసిపోతుంది. ఆల్రెడీ హీరోయిన్ కాకుండా అనసూయ రూపంలో ఓ కీలక లేడీ క్యారెక్టర్ సినిమాలో ఉంది. ఆ క్యారెక్టర్ పుష్ప2లో మరింత కీలకం కానుందని టాక్. అలాంటప్పుడు సాయిపల్లవి కోసం ఇంకే పాత్రను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు కానీ ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉంటుందనేది మాత్రం నిజం. ఫస్ట్ పార్ట్‌లో సమంత మాదిరిగానే ఓ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో మెరవనుందని తెలుస్తోంది. అయితే ఆ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కాదనేది మాత్రం నిజం.













