త్వరలో ప్రపంచానికి మన రామాయణం !
రెండు రోజుల క్రితం ప్రఖ్యాత దర్శక నిర్మాత నిమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న రామాయణ సినిమా ట్రైలర్ విడుదలైంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషలలో ఈ సంవత్సరం దీపావళిలో విడుదల అవుతుంది అని చెపుతున్నారు. అంతే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో వారి వారి భాషలలో విడుదల చెయ్యాలని, అంతర్జాతీయ మార్కెట్ ఈ సినిమా కు ఉందని ఈ చిత్ర నిర్మాణ బృందం భవిస్తూ ఆ విధంగా ప్రయత్నాలు మొదలెట్టింది అని తెలుస్తోంది.
ఇప్పుడు మారుతున్న సినీ నిర్మాణ వ్యవస్థలో బాహుబలి, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ లతో తెలుగు దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమాని లేదా ఇండియన్ సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇప్పుడు ప్రపంచం ఎదురుచూసే పెద్ద సినిమాలన్నీ టెక్నికల్ గా వాటి గ్రాండ్ యర్, టెక్నికల్ ఎక్సలెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చే ఇంపాక్ట్ ఆ సినిమా విజయాన్ని తెలుపుతున్నాయి. ఈ నెలలో విడుదలైన ఒడిస్సి సినిమా కూడా అంతర్జాతీయంగా అన్ని దేశాల్లోనూ గొప్ప సినిమాగా గుర్తింపు రావడానికి కారణం ఆ సినిమా స్టోరీ తో పాటు ఆ సినిమాలో ఉన్న గ్రాండ్ యర్ అండ్ విజువల్ ఇంపాక్ట్.
ఈ సమయంలో మన దేశమంతా చెప్పుకునే రామాయణం స్టోరీ ప్రపంచానికి అందించడానికి నిమిత్ మల్హోత్రా తన ప్రయత్నం బానే చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఆ ట్రైలర్ చూస్తే రాముడు గా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడగా కన్నడ హీరో యాష్, హనుమంతుడు గా సున్ని డియోల్ , దశరథ మహారాజుగా అరుణ్ గోవిల్, శుర్పణక గా రకుల్ ప్రీత్ సింగ్, కైకేయి గా శోభన , లక్ష్మణుడు గా రవి దూబే నటించారు అని తెలుస్తోంది. అయితే ఆ ట్రైలర్ చూసిన వెంటనే టెక్నికల్ గా చాలా బాగుందన్న భావనే మొదట కలుగుతుంది.
ఈ సందర్భంగా ఒక్కసారి 1987లో శ్రీ రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ గుర్తు తెచ్చుకుందాం. ఆ రోజుల్లో దూరదర్శన్ లో ఆదివారం రామాయణ సీరియల్ వచ్చే టైంలో రోడ్డు మీద జనాలు కూడా ఉండేవారు కాదు అని కథనాలు విన్నాం. మనందరం ఆ రామాయణాన్ని మన రామాయణం గా, మన పురాణాల్లో ఉండే రాముడి కధ గా భావించాం. ఓన్ చేసుకున్నాం. అప్పుడు రాముడు గా ఉన్న అరుణ్ గోవిల్, సీతగా నటిం దీపికా లను నిజమైన సీతారాములుగా భావించాం. దేశం మొత్తం జైశ్రీరామ్ అంటూ భక్తి భావంతో ఊగిపోయింది. ఇప్పుడు రాబోయే రామాయణ్ సినిమాని అప్పటి రామాయణ్ టెలి సీరియల్ తో పోల్చకూడదు అని నా మనవి. ఎందుకంటే అది టెలి సీరియల్ రావటం వల్ల, అనేక ఎపిసోడ్స్ లో తీయటం వల్ల, ప్రతి చిన్న కథనాన్ని లేదా చిన్న ఎమోషన్ ని కూడా చాలా డీటెయిల్ గా వివరించారు. అది అందరి మనసుల లోకి వెళ్ళింది. ఇప్పుడు వచ్చే రామాయణం అనేది సినిమా అది రెండు పార్ట్స్ గా వస్తున్నది. పార్ట్ వన్ ఈ సంవత్సరం దీపావళి విడుదల అవుతుంది ఎంత లేదన్నా కూడా అది మూడు గంటల సినిమా. 50 ఎపిసోడ్ చూపించిన రామాయణ కథనం మూడు గంటలకు చూపించాలి కాబట్టి కథలో ఉన్న భావోద్వేగం ప్రేక్షకులకు కలగకపోవచ్చు. ఆ మధ్యలో హీరో ప్రభాస్ తో ఆది పురుష్ అనే సినిమా తీస్తే , ఆ విజువల్ గ్రాండ్ యర్ లేకపోవటం వల్ల సినిమా ప్లాప్ అయింది. .
కానీ మన దేశం నుంచి అంతర్జాతీయ మార్కెట్లోకి ఈ రామాయణం వస్తోంది తప్పకుండా బావుంటుంది అని ఆశించడం లో తప్పు లేదు కదా.. బాగుంటుంది అని అనుకుంటూ ముందుకెళ్దాం. ఇప్పుడు ఈ రామాయణ్ చిత్ర నిర్మాణంలో కావలసినంత విజువల్ గ్రాండ్ యర్ ఉన్నది కాబట్టి ఇది బాగుంటుంది అనుకుందాం. ప్రపంచాన్ని మెప్పిస్తే , అంత కంటే మనకు కావాల్సింది ఏముంది?
ఎందుకు చెపుతున్నానంటే సినీ ప్రపంచం ఒక వ్యాపార రంగం. బావుందని చెప్పే వారి కంటే బాలేదని ట్రోలింగ్ చేసే వారీ ఎక్కువ ఉంటారు. రామానంద్ సాగర్ రామాయణ తో కొందరూ, ప్రభాస్ తో వచ్చిన ఆదిపురుష్ తో కొందరూ ఇప్పటికే తమ పోలిక లతో సోషల్ మీడియా లోకి వస్తున్నారు.
ఈ సినిమా ప్రపంచానికి రామాయణ కథని ప్రస్తుత ప్రేక్షకులకు నచ్చే విధంగా అందిస్తుంది కనుక అందుకు మనం సంతోషిద్దాం. ఆ విధంగా నైనా మన దేశం హిందూ దేశం అని , మన దైవం శ్రీరాముడిని ప్రపంచానికి తెలిస్తే మంచిదే కదా!








