నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.3 సినిమాకు “మోసపోయాం జానకి” టైటిల్ అనౌన్స్ మెంట్
సాయి సోహన్, విస్మయ శ్రీ, విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ బ్యానర్స్ తమ ప్రొడక్షన్ నెం.3 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ రోజు ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి “మోసపోయాం జానకి” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఒక డిఫరెంట్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు మధుసూధన్ రెడ్డి గోపు రూపొందిస్తున్నారు.
ముగ్గురు యువకులు డబ్బు సంచులతో అంబాసిడర్ కారు దగ్గరకు నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ తో డిజైన్ చేసిన “మోసపోయాం జానకి” సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన కరెన్సీ నోట్లు కొన్ని వీరి సంచుల నుంచి కిందపడటం పోస్టర్ లో రివీల్ చేశారు. ఈ సినిమాను క్రైమ్ కామెడీ జానర్ లో మంచి ఎంటర్ టైన్ మెంట్ తో దర్శకుడు మధుసూధన్ రెడ్డి గోపు రూపొందిస్తున్నామని, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.







