స్వయంభు వీఎఫ్ఎక్స్ పై నిఖిల్ ఏమంటున్నారంటే
నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddarth) నటిస్తున్న స్వయంభు(Swayambhu)పై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి(Bharath krishnamachari) భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. యోధుడి పాత్రలో నిఖిల్ కనిపించనున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కీలక దశకు చేరుకున్నాయి. దీంతో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ మొదలైంది.
రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే స్వయంభుకు పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎక్కువ టైమ్ తీసుకుంటోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్‌కు భారీ ప్రాధాన్యం ఉండటంతో గ్రాఫిక్స్ పనులు నెలలుగా కొనసాగుతున్నాయి. దాదాపు 2,700 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటంతో ప్రతి సీన్ ను ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నట్లు నిఖిల్ వెల్లడించారు. ఆడియన్స్ ఇప్పుడు విజువల్స్‌లో చిన్న లోపాన్ని కూడా గుర్తించే స్థాయిలో ఉన్న నేపథ్యంలో, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా టీమ్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సుమారు 175 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న స్వయంభుపై అంచనాలు భారీగా ఉన్నాయి. షూటింగ్ కంటే ఎక్కువగా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టాల్సి రావడం సినిమాను ఏ స్థాయిలో రూపొందిస్తున్నారనే దానిపై ఆసక్తిని పెంచుతోంది. వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఆఖరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో త్వరలోనే రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.








