జైలర్2తో ప్రసంశలందుకుంటున్న నెల్సన్
సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) నటించిన జైలర్2(jailer2) బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. ఈ సినిమాతో డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్(nelson dileep kumar) మరోసారి తనదైన మేకింగ్ శైలితో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు.ముఖ్యంగా రజనీకాంత్ వయసుకు తగినట్లుగా ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం ప్రశంసలు అందుకుంటోంది. యాక్షన్ సీన్స్ లో అనవసరమైన హడావుడికి తావివ్వకుండా, సహజత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రజనీ స్టైల్‌ను కాపాడుతూనే, క్యారెక్టర్ లో హుందాతనాన్ని ప్రదర్శించేలా నెల్సన్ జాగ్రత్తలు తీసుకున్నారు.
మరోవైపు, జైలర్2 ఫస్టాఫ్‌లోని ఎంటర్టైన్మెంట్స్ సీన్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కథలోని గంభీరమైన అంశాలకు మధ్యలో కామెడీని యాడ్ చేసి, అన్ని వర్గాల ఆడియన్స్ ఆస్వాదించేలా డైరెక్టర్ ప్రయత్నించారు. ముఖ్యంగా నమో నారాయణ(namo narayana), యోగిబాబు(Yogibabu)ల క్యారెక్టర్లను కామెడీ పండించే విధంగా ఉపయోగించుకున్న తీరు సినిమాకు ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ గా మారింది. యాక్షన్, కామెడీ మధ్య సమతుల్యత పాటించడం నెల్సన్ పనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది.
క్రియేటివ్ అంశాలతో పాటు నిర్మాణ నిర్వహణలోనూ నెల్సన్ ప్రశంసలు అందుకుంటున్నారు. అనుకున్న బడ్జెట్లోనే సినిమాను కంప్లీట్ చేయడం, అనుకున్న టైమ్ కు ఆడియన్స్ ముందుకు సినిమాను తీసుకురావడం చిత్రబృందానికి కలిసొచ్చింది. మరోవైపు, జైలర్3(Jailer3)ను కూడా తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రజనీకాంత్, నెల్సన్ తమ ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న తర్వాత ఈ సీక్వెల్ పట్టాలెక్కనుంది. దీంతో తదుపరి భాగంపై ఇప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.








