ది ప్యారడైజ్ కోసం నాని త్యాగం..
నేచురల్ స్టార్ నాని(nani) కెరీర్లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమాల్లో ది ప్యారడైజ్(the paradise) ఒకటి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth odela)పై నాని పెట్టుకున్న నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో రూపొందించారు. అయితే అనుకున్న టైమ్ కు షూటింగ్ పూర్తికాకపోవడం, బడ్జెట్ భారీగా పెరిగిపోవడం నిర్మాతకు భారంగా మారినట్టు ఎన్నో రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. మొదట 100 వర్కింగ్ డేస్లోనే షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ వేసుకోగా, చివరకు 180 రోజులకు పైగా షూటింగ్ కొనసాగినట్లు సమాచారం. దీంతో బడ్జెట్ అంచనాలు తలకిందులై, సినిమా ఆర్థిక లెక్కలు మారిపోయాయి.
థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కు మంచి ధర లభించినప్పటికీ, పెరిగిన నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా రికవరీ చేయడం సాధ్యం కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri)కి ఆర్థికంగా అండగా నిలిచేందుకు నాని తన రెమ్యూనరేషన్లో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. సినిమా రిలజ్ సజావుగా సాగడంతో పాటు, నిర్మాణ సంస్థపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నాని ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే షూటింగ్ రోజులు పెరగడం, బడ్జెట్ అదుపు తప్పడం వంటి అంశాలపై ముందుగానే కంట్రోల్ ఉండి ఉంటే నిర్మాతకు మెరుగైన ఫలితం దక్కేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ రావడంతో పాటు, ఆంధ్రప్రదేశ్లోని పలువురు డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. నాని తీసుకున్నట్లు ప్రచారంలో ఉన్న నిర్ణయం అభినందనీయమే అయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రణాళికలో లోపాలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.








