Naga Vamsi: ప్రశంసలే కాదు, విమర్శలనీ తీసుకోవాలి

తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల స్థాయికి వెళ్లాడు సూర్యదేవర నాగవంశీ(suryadevara naga vamsi). సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) సంస్థ అధినేతగా వంశీ అందరికీ పరిచయస్తుడే. నిర్మాతగా వంశీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఉన్నది ఉన్నట్టు మొహం మీదే చెప్పే వ్యక్తిత్వమే వంశీని ఆ స్థాయిలో నిలబెట్టింది. అయితే ఆయన రీసెంట్ గా చేసిన కొన్ని కామెంట్స్ పలు కాంట్రవర్సీలకు దారి తీశాయి.
సోషల్ మీడియాలో వంశీపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. వంశీ ఇటీవల డిస్ట్రిబ్యూట్ చేసిన బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా వార్2(war2) ఎన్నో అంచనాల నడుమ రిలీజై బాక్సాఫీస్ వద్ద ఆ అంచనాలను అందుకోలేకపోయింది. కాగా రీసెంట్ గా మాస్ జాతర(mass jathara) ప్రమోషన్స్ లో ఈ విషయంపై నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. తనతో పాటూ ఎన్టీఆర్(NTR) కూడా యష్ రాజ్ ఫిల్మ్స్(Yash raj films) నిర్మాత ఆదిత్య చోప్రాను నమ్మామని, కానీ మూవీ మిస్ ఫైర్ అయిందని, అందుకే తనను నెట్టింట ట్రోల్ చేశారని చెప్పాడు.
అయితే తాను కేవలం వార్2 ను డిస్ట్రిబ్యూట్ మాత్రమే చేశానని, ఒకవేళ దాన్ని డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేసి ఉంటే రెస్పాన్స్ మరోలా ఉండేదని, ఏదేమైనా సోషల్ మీడియాలో పొగడ్తలతో పాటూ విమర్శలు కూడా ఈక్వల్ గా ఉంటాయని, తీసుకుంటే రెండింటినీ తీసుకోవాలని, లేదంటే లైట్ తీసుకోవాలని వంశీ చెప్పాడు. కాగా రవితేజ(raviteja), శ్రీలీల(sree leela) జంటగా భాను భోగవరపు(bhanu bhogavarapu) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర అక్టోబర్ 31న రిలీజ్ కానుంది.