Nag Ashwin: మహేష్ సినిమాపై నాగ్ అశ్విన్ కామెంట్స్
అసోసియేట్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన నాగ్ అశ్విన్(Nag Ashwin), ఎవడే సుబ్రమణ్యం(Yevade Subramanyam) తో డైరెక్టర్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తర్వాత సావిత్రి(Savitri) బయోపిక్ ను మహానటి(Mahanati) పేరుతో తీసి అందరి ప్రశంసలందుకున్నాడు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తో కల్కి 2898ఏడీ(Kalki 2898AD) పేరుతో సినిమా తీసి భారీ కలెక్షన్లను అందుకోవడంతో పాటూ ఆ మూవీతో అందరి చూపుని తన వైపుకు మరల్చుకున్నాడు.
రీసెంట్ గా ఓ కార్యక్రమంలో భాగంగా కాలేజ్ స్టూడెంట్స్ తో మాట్లాడాడు నాగి. ఆ ఇంటరాక్షన్ లో భాగంగా నాగ్ అశ్విన్ మహేష్ బాబు(Mahesh Babu)- త్రివిక్రమ్(Trivikram) కలయికలో వచ్చిన ఖలేజా(Khaleja) సినిమా గురించి మాట్లాడాడు. ఖలేజా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ మూవీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీకు ఏదైనా సినిమాను డైరెక్ట్ చేయాలనుందా అని అడిగిన ప్రశ్నకు నాగి ఆన్సర్ ఇచ్చాడు.
ఖలేజా, డియర్ కామ్రేడ్(Dear Comrade)సినిమాలకు తాను ఎడిటర్ అయుంటే బావుండేదని, గతంలో కూడా నాగ్ అశ్విన్ తనకు ఖలేజా సినిమా అంటే ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నాగి చెప్పిన రెండు సినిమాలూ ఫ్లాపులుగా నిలిచినవే. అలాంటి సినిమాలకు తాను వర్క్ చేసి ఉంటే సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లేవాడినని నాగి చెప్పాడా లేక ఆ సినిమాలు తనకు ఇష్టం కాబట్టి వర్క్ చేస్తే బావుండేది చెప్పాడా అనేది మాత్రం తనకే తెలియాలి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి2(Kalki2) స్క్రిప్ట్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు.













