హీరోయిన్ అనన్య నాగళ్ల ‘లీసా’ సినిమా టీమ్ లో జాయిన్ అయిన మెలొడీ బ్రహ్మ మణిశర్మ
నవంబర్‌లో ఘనంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘లీసా’
ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ (IRAHS) ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతురాలైన నటి అనన్య నాగళ్ల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను రూపొందించారు. తాజాగా ఈ సినిమా టీమ్ లో జాయిన్ అయ్యారు మెలొడీ బ్రహ్మ మణిశర్మ. స్క్రిప్ట్ విని ఇంప్రెస్ అయిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు వహించేందుకు ముందుకొచ్చారు. ఆయన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పులి రాకేష్ గౌడ్, కె. నరసింహులు, బనడ్ల శ్రీపతి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లీసా’ సినిమా నవంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.








