మహేష్ డెసిషన్ కరెక్టే
కొంతమంది డెసిషన్స్ తీసుకునే విషయంలో ఎంతో కఠినంగా ఉంటారు. వాళ్లు ఆ టైమ్ లో అలా ఉండటం వల్లే స్టార్ గా క్రేజ్ తెచ్చుకుంటారనే విషయం చాలా లేటుగా తెలుస్తోంది. రీసెంట్గా ఓ ఛానెల్ ఓపెన్ డిబేట్ లో పాల్గొన్న సీనియర్ యాక్ట్రెస్ సుహాసిని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెల్లడించారు. సుహాసిని భర్త మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీని మొదట్లో ఒక భాగంగా కమల్ హాసన్‌తో పల్ఆన్ చేశారట.
కానీ అది సెట్స్ పైకి వెళ్లలేదు. తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ను పెట్టి మల్టీస్టారర్ గా పాన్ ఇండియా లెవెల్ లో తీద్దామనుకుని వారిద్దరినీ అడిగారట. కానీ డేట్స్ ప్రాబ్లమ్ వల్ల ఆ ఇద్దరూ పొన్నియన్ సెల్వన్ ను చేయలేకపోయారట. అలా పొన్నియన్ సెల్వన్ జయం రవి, చియాన్ విక్రమ్ కు వెళ్లిందట.
ఓ విధంగా చెప్పాలంటే మహేష్ ఈ సినిమా వదులుకుని మంచి నిర్ణయమే తీసుకున్నాడు. ఈ సినిమాకు క్రేజ్ వచ్చినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నివ్వలేదు. తమిళంలో సినిమా బాగానే ఆడింది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా అక్కడక్కడకు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మహేష్ ఈ సినిమా చేయకపోవడం బెటర్ అని అందరూ ఫీలవుతున్నారు.













