రీరిలీజ్‌కు రెడీ అవుతున్న మహేష్ డిజాస్టర్ మూవీ
ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. వాటికి ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో పాత సినిమాలను మరళా ఏదో సందర్భం చూసుకుని 4Kలో రీరిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలను ఫ్యాన్స్ కోసం రీరిలీజ్ చేసి మంచి కలెక్షన్లు అందుకుంటున్నారు నిర్మాతలు. రీసెంట్ గా మహేష్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ చేసిన మురారికి రూ.9 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
తర్వాత ఇంద్ర సినిమాకు కూడా మంచి వసూళ్లే వచ్చాయి. ఇక తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ చేసిన గబ్బర్ సింగ్ కు మొదటి రోజే రూ.4 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదలు సైతం గబ్బర్ సింగ్ ఊపుని తగ్గించలేకపోయాయి. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు డిజాస్టర్ సినిమా అయిన ఖలేజాని రీరిలీజ్ చేయాలని చూస్తున్నారట.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా రిలీజైన టైమ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. కానీ తర్వాత టీవీలో, ఓటీటీలో మాత్రం సినిమా అందర్నీ ఆకట్టుకుంది. అయితే రీరిలీజుల్లో మాస్ సినిమాలకు మాత్రమే మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఖలేజా ఇప్పుడు మళ్లీ రిలీజ్ అయినా ఎంతమంది చూస్తారనేది ప్రశ్నగా మిగిలింది. ఆల్రెడీ 4K వెర్షన్ ట్రైలర్ ను కూడా రెడీ చేస్తున్నారట. మంచి టైమ్ చూసుకుని ఈ సినిమాను రీరిలీజ్ చేయాలని చూస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.













